తాజా కథలు @ CCK

పొడుపు కథలు

2015-06-15 13:05:01 పొడుపు కథలు
* దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.
జ. వల

* పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
జ. ఉంగరం

* పొడవాటి మానుకి నీడే లేదు.
జ. దారి

* పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.
జ. పొయ్యి

* ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.
జ. అత్తిపత్తి

* ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.
జ. కళ్లజోడు.

* పైడిపెట్టెలో ముత్యపు గింజ
జ. వడ్లగింజ

* తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.
జ. కడవ, చెంబు

* పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.
జ. మొగలిపువ్వు.

* ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?
జ. తమలపాకు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం