తాజా కథలు @ CCK

జాతికి ఊపిరి స్వాతంత్ర్యం

2015-03-28 07:05:01 దేశభక్తి గీతాలు
జాతికి ఊపిరి స్వాతంత్ర్యం, అది జ్యోతిగ వెలిగే చైతన్యం
ఆ చైతన్యం నిలిచిన నాడే సమస్త జగతికి సౌభాగ్యమ్ ||
శిఖరంలా , ప్రతి మనిషీ, శిరసెత్తిన నాడే,
జలనిధిలా ప్రతి హృదయమ్ అలలెత్తిన నాడే,
మానవ జీవన గమనంలో మాయని వెలుగుల మహోదయమ్ ||
ఎప్పటి ఎప్పటి రుచిరస్వప్నం, ఈ స్వాతంత్ర్యం
ఎందరి ఎందరి త్యాగ ఫలం, ఈ స్వాతంత్ర్యం
అందక అందక అందిన ఫలమును అందరికీ అందివ్వండి ||
స్వరాజ్య సిద్ధికి లక్ష్యమేమిటో స్మరించుకోండి
జాతి విధాత వినూత్న ఫలాలను సాధించండి
సమస్యలన్నీ పరిష్కరించే సౌమ్య మార్గం చూపండి ||
కలతలు కక్షలు రేపొద్దు ఏ కులం పేరుతో
మారణ హోమం జరపొద్దు ఏ మతం ముసుగులో
సమైక్య భారత సౌధాగ్రం పై, శాంతి దీపం నిలపండి ||

(రచన: సి. నారాయణ రెడ్డి)

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం