తాజా కథలు @ CCK

పనికిరాని వైద్యం

2015-05-28 19:05:01 చిన్నారుల కథలు
రామాపురంలో విశ్వనాధం అనే వైద్యుడు ఉండేవాడు . వైద్యానికి ప్రసిద్ధి అయిన ఫొరుగు రాజ్యంలో అనేక ఏళ్లు శిక్షణ తీసుకొని మంచి ప్రావీణ్యం సాధించి వచ్చాడతాడు . రామాపురంతోపాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా విశ్వనాధం దగ్గరకు రావాల్సిందే . ఎలాంటి జబ్బునైనా తగ్గించే సామర్ధ్యం అతడికి ఉండేది . రామాపురం కొండలూ అడవుల మధ్య ఉన్న గ్రామం . అక్కడి ప్రజలు తరచూ పాముకాటుకి గురయ్యేవారు . పాముకాటుకు విరుగుడుగా విశ్వనాధం వేసి మందు చాలామంది ప్రాణాల్ని నిలిపేది .
విశ్వనాధానికి వైద్యవిద్యలో వారసులేవరూలేరు . వైద్యంలో తనకున్న నైపుణ్యాల్ని వేరెవరికైనా నేర్పితే వారు తనను మించిపోతారేమోనన్న భయం అతడిది . అతడికి ఎంతోమంది సహాయకులు ఉండేవారు కానీ, ఏ వ్యాధికి ఏ మందు వాడాలో వారిలో ఎవరికీ తెలిసేది కాదు . పొరుగూరు జమీందారుకి ఆరోగ్యం బాగాలేదంటే ఓసారి రాత్రికి రాత్రి తన పరివారంతో బయలుదేరాడు విశ్వనాధం . జమీందారుకి చికిత్స ముగించుకొని తిరిగి వస్తుండగా తోవలో విశ్వనాధాన్ని పాము కాటు వేసింది . వెంటనే అతడు స్పృహ కోల్పోయాడు . ఆ సమయంలో అతడి దగ్గర మందుల పెట్టె ఉంది . సహయకులూ ఉన్నారు . కానీ ఆ పెట్టెలోని ఏ మందుని పాము కాటుకి విరుగుడుగా వాడాలో వారెవరెకీ తెలియలేదు . దాంతో అతడికి చికిత్స చేయలేకపోయారు . కాసేపటికి విశ్వనాధం మరణించాడు . తనకు తెలిసిన విద్యను మరో నలుగురికి నేర్పకుండా , కేవలం తనొక్కడికి మాత్రమే గొప్ప వైద్యుడన్న కీర్తి దక్కాలన్న సంకుచిత బుధ్ధి కారణంగా ఎంతో నైపుణ్యం ఉన్న వైద్యుడు వైద్యం అందక చనిపోయాడు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం