తాజా కథలు @ CCK

తెలివైన యువకుడు

2015-05-12 09:05:01 చిన్నారుల కథలు
మహేంద్రనగరిని పాలించే భూపతిరాజుకి ఒక యువకున్ని మంత్రిగా పెట్టుకోవాలనిపించింది . దానికోసం చాటింపు వేయించాడు . మంత్రి అవ్వాలనే లక్ష్యంతో సభకు వందల మంది యువకులు వచ్చారు . అక్కడికి వచ్చిన వారందరినీ......"చంద్రుడూ , వెన్నెలా కనిపించకుండా చేయాలంటే ఎంత పెద్దపళ్ళాన్ని చంద్రుడికీ, మనిషికీ మధ్య ఉంచాల"ని ప్రశ్నించాడు రాజు . ఆ సమాధానాన్ని బయటకు చెప్పకుండా ఒక చీటీ మీద పేరుతోపాటు రాసి పెట్టెలో వేయమని చెప్పాడు .
ప్రశ్న చాలా చిక్కుగా ఉందని అక్కడి వారంతా అనుకున్నారు . ఎలాగూ వచ్చాం కాబట్టి సమాధానం ఇవ్వాల్సిందేనని నిశ్చయించుకొని ..........ఒకరు " పర్వతం అంత " అంటే మరొకరు "బండి చక్రం అంత " నీ ......ఇంకా చాలా మంది చాలా రకాల సమాధానాలు రాశారు . ఒకడు మాత్రం కనుగుడ్డుకి అడ్డంగా దానికంటే కాస్త పెద్దదైన పరిమాణంలో పెట్టాలని సమాధానం ఇచ్చాడు .
ఆ సమాధానం చదివిన రాజు తనకు సరైన మంత్రి దొరికాడని అతన్ని పిలిపించాడు . అయితే
అతడు నిజంగా తెలివైన వాడా , లేక ఏదో మామూలుగా సమాధానం చెప్పాడా తేల్చుకోవడానికి అతడి తెలివిని మళ్లీ పరీక్షించాలనుకున్నాడు రాజు .
' క ' అనే మనిషి 'ప ' అనే మనిషికి తండ్రి అవుతాడు . కానీ ,'ప ' అనే మనిషి 'క ' అనే మనిషికి కొడుకు కాదు . ఇదెలా సాధ్యమని అడిగాడా కుర్రాడిని . 'ప ' అనే మనిషి 'క ' అనే మనిషికి కొడుకు కాకపోతే కూతురు కావొచ్చని సమాధానమిచ్చాడా వ్యక్తి.
రాజు అతడి తెలివితేటల్ని మెచ్చి తన ఆస్థానంలో అతన్ని మంత్రిగా నియమించుకున్నాడు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం