తాజా కథలు @ CCK

బామ్మమాట

2015-04-18 23:05:01 చిన్నారుల కథలు
రాముడు , లక్ష్మణుడు కవల పిల్లలు . చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో నాన్నమ్మ దగ్గరే పెరిగారు . తల్లిదండ్రుల్లేని పిల్లలని అతిగారాబం చేయడంతో అన్నదమ్ములిద్దరూ బద్దకస్తుల్లా తయారయ్యారు . కష్టపడి పనిచేయమనీ ఆపదలో ఉన్నవారికి సాయపడమనీ నాన్నమ్మఎంతచెప్పినా వినిపించుకునేవారు కాదు . రాములమ్మ చిన్నాచితకా పనులు చేసి సంపాదించింది కాస్తా ముగ్గురూ తినడానికే సరిపోయేది . దాంతో ఓరోజు ఏదైనా పని చేసి సంపాదించి కష్టపడి బతుకమని అన్నదమ్ములిద్దరినీ పట్నం పంపింది రాములమ్మ .
ప్రయాణంలో భాగంగా అడవిలో నడుస్తున్న అన్నదమ్ములకు రహదారి పక్కనే ఉన్న పొదల్లోంచి ఎవరో బాధగా మూలుగుతున్న శబ్దం వినిపించింది . అక్కడకు వెళ్లి చూస్తే స్పృహతప్పి పడివున్న ఒక పెద్దమనిషి కనిపించాడు . ఎందుకొచ్చిన గొడవలే అనుకుని అక్కడి నుంచి వెల్లిపోబోయారుగానీ ఆపదలో ఉన్నవారికి సాయం చేయమని నాన్నమ్మ ఎప్పుడూ చెబుతుండే మాటలు గుర్తుకొచ్చి అతడి ముఖాన కాసిన్ని నీళ్లు చల్లి సపర్యలు చేశారు. స్పృహలోకి వచ్చిన పెద్దమనిషి ......... తానో నగల వ్యాపారిననీ పట్నంలో ఉన్న దుకాణానికి కొత్త నగలను తీసుకెళుతుంటే అడవిలో దొంగలు అటకాయించి నగలు దోచుకుపోవడమే కాకుండా ఇలా కొట్టి పడేశార "నీ వాపోయాడు . నడవలేని స్థితిలో ఉన్న అతడిని జాగ్రత్తగా ఇంటికి చేర్చారు అన్నదమ్ములు . ఆపదలో ఉన్నవారికి సాయం చేసే అన్నదమ్ముల నైజం నచ్చడంతో అతడు వారిద్దరికీ తన నగల దుకాణంలో పని కల్పించాడు . అంతేకాదు నగలు కొనడానికి ఎప్పుడు పట్నం వెళ్లాల్సి వచ్చినా అన్నదమ్ములిద్దరినే సాయంగా తీసుకెళ్ళేవాడు . ఆ తర్వాత వాళ్లు యజమాని దగ్గర నమ్మకస్తులుగా మంచి పేరు సంపాదించుకుని గ్రామంలో ఇంకా కష్టపడుతున్న బామ్మచేత పనులు మాన్పించి పట్నానికి తీసుకొచ్చేశారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం