తాజా కథలు @ CCK

మంత్రి తెలివి

2015-03-27 15:05:01 చిన్నారుల కథలు
అవంతీ రాజ్యానికి రాజైన భూపాలుడికి పొగడ్తలంటే చాలా ఇష్టం . ఎవరైనా తన పాలన గురించి కాస్త మంచిగా చెబితేచాలు ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు . తన రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో ఆనందంగా ఉన్నారని పొంగి పోయేవాడు . పైగా తనంత గొప్పగా ఇంతవరకూ ఏ రాజూపాలించలేదనుకునేవాడు . దానికితోడు తనకు క్షవరం చేయడానికి వచ్చే తిప్పడిని " ప్రజలంతా ఎలా ఉన్నారు ? నా గురించి ఏం చెప్పుకుంటున్నార" ని అడిగేవాడు . రాజుగారి బలహీనతను ఆసరాగా తీసుకుని తిప్పడు" ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు . మిమ్మల్ని దేవుడిలా కొలుస్తున్నా " రంటూ కల్పించి చెప్పేవాడు . దాంతో పొంగిపోయిన రాజుగారు తిప్పడికి మంచి బహుమతులు ఇచ్చి పంపేవారు . దర్బారు నిర్వహించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకుండా ఇలా తిప్పడిమీద ఆధారపడటం మంత్రి వివేకుడికి అసలు నచ్చేదికాదు . దాంతో , బాగా ఆలోచించి ఓ చక్కని పధకం వేశాడు . తిప్పడిని పిలిచి రాజు ఇచ్చే వాటికంటే ఇంకా ఎక్కువ విలువైన బహుమతులు ఇచ్చి, రాజుగారికి వాస్తవ పరిస్థితిని చెప్పమన్నాడు . ఫలితంగా .......... వాడు రాజుతో "రాజా, రాజ్యంలో దొంగలు బాగా ఎక్కువయ్యారు . ప్రజల ఆస్తులకు ఏమాత్రం రక్షణలేకుండా పోయింద" ని చెప్పాడు . తిప్పడి మాటలు విన్న రాజుగారు వెంటనే దర్బారుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రిని ఆజ్ఞాపించాడు. ఆ దర్బారులో ప్రజల సమస్యలన్నీ తెలుసుకోగలిగాడు రాజు . తన పధకం ఫలించినందుకు ఎంతో సంతోషించాడు వివేకుడు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం