తాజా కథలు @ CCK

చిలుక - సహాయం

2015-06-07 01:05:02 చిన్నారుల కథలు
రామాపురం లో సుందరం అనే యువకుడు ఉండేవాడు.చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అతడిని నాన్నమ్మే పెంచి పెద్ద చేసింది.ఆ పెద్దావిడ పెంపకంలో అతడికి మంచితనం,నలుగురికి సాయపడే తత్త్వం బాగా అలవడ్డాయి.సుందరం అడవిలో కట్టెలు కొట్టుకొని జీవించేవాడు.ఒక రోజు కట్టెలు కొడుతున్న అతడికి దెబ్బలు తగిలి కిందపడి ఉన్న చిలుక కనిపించింది.కాసిని నీళ్లు చల్లి,ఆకు పసరుతో దెబ్బలకు పూత వేయగానే కాస్త కోలుకున్న చిలుక మంచి మనసుతో సేవ చేసి న ప్రాణాలు కాపాడావు.అవసరంలో నీకు తప్పకుండా సాయపడతాను అంటూ ఎగిరిపోయింది.ఆ విషయాన్ని అంతటితో మర్చిపోయి తన పనుల్లో పడిపోయాడు సుందరం.

ఒక రోజు రాజు గారు వేటకు వెళ్ళినప్పుడు వజ్రాల ఉంగరం పొరపాటున అడవిలో ఎక్కడో జారి పడిపోయింది.ఆ ఉంగరం తరతరాల నుంచి వారసత్వంగా వస్తోంది.అది చేజారిపోవటాన్ని ఆశుభంగా భావించిన రాజు గారు ...'ఆ ఉంగరం తెచ్చి ఇచ్చిన వారికి ఘనమైన కానుక ఇస్తాను' అంటూ చాటింపు వేయించాడు.మర్నాడు కట్టెలు కొట్టడంలో నిమగ్నమయిన సుందరం భుజాన వాలిన చిలుక...'మిత్రమా ,ఆ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను కాపాడావు.

ఇప్పుడు నీ ఋణం తీర్చుకొనే అవకాశం నాకు వచ్చింది.ఇదిగో ఈ ఉంగరాన్ని తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చి తగిన కానుకను అందుకో ' అంటూ లోయలో పడిపోయిన రాజు గారి ఉంగరాన్ని తెచ్చి ఇచ్చింది.దాన్ని తీసుకెళ్ళి రాజు గారికి అందిచిన సుందరం విలువయిన కానుకలను,పెద్దమొత్తంలో సొమ్మును భహుమతిగా అందుకున్నాడు.ఆ సొమ్ముతో సొంత వ్యాపారం ప్రారంభించి నానమ్మను బాగా చూసుకుంటూ సుఖంగా జీవించసాగాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం