తాజా కథలు @ CCK

మంచి మాటలు 621నుండి 630 వరకు

2015-03-13 11:05:01 మంచి మాటలు
*  క్షమతో కోపాన్నీ, వినయంతో గర్వాన్నీ, ముక్కుకు సూటీగా పోయే గుణంతో మోసాన్నీ, సంతృప్తితో దురాశను జయించండి.
*  శాంతంగా ఉండండి. అప్పుడు ప్రతివారిని అదుపు చేయగల్గుతారు.
*  ఉదార బుద్దితో చేయబడిన పని ఎప్పటికీ నశించదు.
*  ధైర్యం చేయడం గొప్ప విషయమే కానీ సహించడం మరింత గొప్ప విషయం.
*  విషయం సమగ్రంగా తెల్సుకోకుండానే తృణీకరించకండి. నిర్ణయించకండి.
*  అంతరాత్మను పవిత్రంగా ఉంచి భయాన్ని ఎల్లప్పటికీ మరచిపోండి.
*  మీ కష్టాలను కాదు మీ దీవెనలను లెక్కపెట్టుకోండి.
*  ఒకరు మరొకరికి జీవితాన్ని. తక్కువ కష్టాలతో కూడిన దానిగా చేయడం కోసం కాకుండా మనం మరి దేనికోసం జీవించగలము?
*  ఉత్సాహశీలికి ఎప్పుడూ విరామం అనేది ఉండదు.
*  మూర్ఖుడు కూడా శాంతంగా ఉంటే వివేకి క్రిందే లెక్క - ఓల్డ్ టెస్ట్ మెంట్.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం