తాజా కథలు @ CCK

మంచి మాటలు 571నుండి 580 వరకు

2015-06-15 21:05:01 మంచి మాటలు
*  ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం.
*  సురక్షితమైన ప్రదేశం నుండీ సాహసంను ప్రదర్శించడం చాలా సులభం.
*  మిమ్మల్ని బాగా ఆలోచించేలా చేయగల పుస్తకాలే మీకు బాగా సహాయం చేయగల పుస్తకాలు అవుతాయి.
*  వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే ప్రారంభమౌతుంది.
*  మన కర్తవ్యాన్ని ఉపేక్షిస్తే, మనమే స్వయంగా నష్టపోతాము.
*  అనవసరమైనదాన్ని వదలివెయ్యడంలోనే చదువు యొక్క కళ ఆధారపడి ఉంది.
*  మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు.
*  ఆత్మ బలం లోపించిన వ్యక్తిలో శ్రద్ద స్థిరపడదు.
*  మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.
*  నీతి ధర్మపు సారం.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం