తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-02-28 13:05:01 మంచి మాటలు
*  మీలోనే మీరు స్వర్గాన్ని చూసుకోగలిగితే ఉహించలేనంత దూరంలో ఉన్న స్వర్గాన్ని మీరు ఎందుకు అభిలషిస్తారు.
*  బుద్ధిలేని విద్య రెండింతల తెలివితక్కువతనం.
*  గతకాలపు పశ్చాత్తాపం, వర్తమానపు ఆవేశం, రానున్న రోజులకు సంబంధించిన ఆదుర్దాలు కలసి మనిషిని నష్టపడేలా చేస్తాయి.
*  సహజత, సరళత జీవితాన్ని తియ్యగా చేస్తాయి.
*  తెలివితేటలు ఉన్నంత మాత్రాన ఎవరూ రచయితలు కాలేరు. ప్రతి పుస్తకం వెనుక ఒక వ్యక్తి ఉన్నప్పుడే అతడు రచయిత అవుతాడు.
*  తమకు తామే సహాయాన్ని చేసుకునేవారికే దేవుడు సహాయపడతాడు.
*  బానిసత్వానికి మనసే కారణం.
* ఈ రోజు పనిని చాలా బాగా చేయడమన్నదే రేపటి కోసం ఉత్తమమైన తయారీ అవుతుంది.
*  మంచి నత్తనడక నడిస్తే చెడు, రెక్కలు కట్టుకుని ఎగురుతుంది.
*  కష్టాలు మనను మనతో పరిచయం చేస్తాయి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం