తాజా కథలు @ CCK

మంచి మాటలు 541నుండి 550 వరకు

2015-04-19 13:05:02 మంచి మాటలు
*  నిజం కోసం మనం అన్నింటిని త్యజించవచ్చును. కానీ దేనికైనా సరే నిజాన్ని మాత్రం త్యజించకూడదు.
*  మంచి మంచిని, చెడు చెడును ఆకర్షిస్తుంది.
*  వయసు, వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు.
*  నెపము లెన్నువాడు తనను తాను నిందించుకునేవాడు.
*  వేదనలకు కుంగిపోక చేతినిండా పని కల్పించుకుంటే ఆనందసుమం దానంతటదే వికసిస్తుంది.
*  మనం ఉన్న తీరు మన ఆలోచనల ఫలితమే.
*  హృదయానికి భూషణం సంస్కృతి అయినట్లే విద్య మనసుకు భూషణం.
*  సంతృప్తికి మించిన సంపద లేదు. ఆనందానికి మించిన ఆస్తి లేదు.
*  వ్యాధి కంటే మనిషిని భయమే ఎక్కువగా చంపుతుంది.
*  ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఇతరులను తన వెంటనడిపింపజేసే నాయకుడు అవుతాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం