తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-05-22 23:05:01 మంచి మాటలు
*  తప్పు చేయని వారు ధరణిలో లేరు.
*  మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి - ఇబ్బెన్.
*  మబ్బునవ్వితే చిరుజల్లు, ఏడుస్తే వడగళ్లు.
*  కామం లాంటి నిప్ప వేరొకటి లేదు.
*  పక్షులు తమ కాళ్ళలో చిక్కుకుని పోతాయి. మనుషులు తమ నాలుకల ద్వారా చిక్కుకునిపోతారు.
*  తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు
*  జీవించే మనిషిని బట్టి జీవితపు సుఖసంతోషాలు ఉంటాయి. అంతేకానీ అతడు చేసే పని పైన కానీ లేదు పనిచేసే స్ధలపైకానీ అవి ఆధారపడి ఉండవు.
*  నిజానికి గ్రహణం పట్టవచ్చునే కానీ అది ఎప్పటికీ సమసిపోదు.
*  ఇతరులను సంతోషపరచడంలోనే నిజమైన ఆనందం ఉంది.
*  ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం