తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-03-02 03:05:01 మంచి మాటలు
*  విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకొన్నవాడే గొప్పవాడు.
*  మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు.
*  మీ కోరికలు అంతులేనివైతే, మీ చింతలూ, భయాలూ కూడా అంతులేనివే - థామస్ పుల్లర్.
*  సురక్షితమైన ప్రదేశం నుండీ సాహసంను ప్రదర్శించడం చాలా సులభం.
*  భగవంతుడు బంధువులను ప్రసాదిస్తాడు. స్నేహితులను మనం ఎన్నుకోగలందుకు భగవంతుడికి ధన్యవాదాలు.
*  పదేళ్ళపాటు పుస్తకం చదవడం కంటే విజ్ఞులైన వారితో గంటసేపు ముచ్చటించడం మేలు.
*  సహాయం పొందడం అన్నది స్వాతంత్ర్యాన్ని అమ్మడం అవుతుంది.
*  ఈ రోజు చేయగల పనిని రేపటికి వాయిదా వేయవద్దు.
*  మనం చేసే పనిని పదిమందీ పంచుకుంటే, చేసే పని ఎంతో తేలికైపోతుంది.
*  పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం