తాజా కథలు @ CCK

మంచి మాటలు 431నుండి 440 వరకు

2015-05-16 23:05:02 మంచి మాటలు
*  మర్యాదాగుణం మిమ్మల్ని సుంకం లేకుండా ఎత్తుకు ఎదగనిస్తుంది.
*  మీ నీచ స్వభావాన్ని జయించండి. మీరు ప్రపంచానికే గురువవుతారు.
*  పోరాడక పోవడం కన్నా, పోరాడి ఓడిపోవడమే గొప్పతనం.
*  మీ ఆలోచనా సరళి మార్చుకుంటే ఆ మీ జీవన సరళి తానుగా మారుతుంది - డా. నార్మన్ విన్సెంట్ పీలే.
*  రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం.
*  ప్రతి ధ్వని ఎప్పుడూ ధ్వనిని వెక్కిరిస్తూ ఉంటుంది.
*  ఙ్ఞాన, తప, యోగ మార్గాలకన్న సేవామార్గం మిన్న.
*  ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనషికి అద్దంపడుతుంది.
*  హృదయంలో చోటుంటే ఇంటిలో తప్పకుండా చోటు ఉంటుంది.
*  ఇచ్చే వస్తువ కంటే కూడా ఆవస్తువును ఇచ్చే విధానమే దాత గుణానికి అద్దం పడుతుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం