తాజా కథలు @ CCK

మంచి మాటలు 421నుండి 430 వరకు

2015-06-06 09:05:01 మంచి మాటలు
*  ఏ దేశానికైన ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది.
*  పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది.
*  సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది.
*  నిన్న సత్యమై నేడు అసత్యమయ్యేది సత్యం కాదు.
*  సాధువులూ, భగవంతుడూ వేరు వేరు కాదు.
*  సంతృప్తి కలవాడే ధనవంతుడు.
*  ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు.
*  సకాలంలో కావలసినంత వరకు సరైన వ్యక్తులపైన, సరైన విషయంలో కోపం చేసుకునే వ్యక్తి ప్రశంసింపబడతాడు.
*  స్వార్ధం చిట్టచివర్లో ఉన్నప్పుడే సేవ ఉత్తమంగా ఉంటుంది.
*  ఓర్పుకు మించిన తపస్సు లేదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం