తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-01-23 09:05:01 మంచి మాటలు
*  మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనిని చిరునవ్వుతో చేయడం అన్నది సహకారం అవుతుంది.
*  మనిషి నుండి ఎన్నటికీ వేరు చేయలేని ఒకే ఒక్క సంపద విద్య.
*  తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది.
*  ఒక మాటను వాడగలిగినప్పుడు రెండు మాటలను వాడకుండా ఉండడంలోనే అన్ని నిపుణత్వాలకు మించిన అతి విలువైన నిపుణత్వం ఉంది.
*  ఆదర్శాలు లేని మనిషి - ఒక విషాద దృశ్యం వంటివాడు.
*  స్నేహితులను ఆకట్టుకోవాలనుకుంటే, ఆసక్తికరమైన వ్యక్తులలో మన చోటును పదిలం చేసుకోవాలంటే ఇతరులు మీ పట్ల ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో అలా మీరు ఇతరులపట్ల వ్యవహరంచండి.
*  క్రియ ద్వారానే కలలు పండుతాయి.
*  మీ దృష్టి వైశాల్యం పెరిగినప్పుడు మీ ఉద్దేశ్యం మరింత ఫలవంతమవుతుంది.
*  సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.
*  అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చెయ్యకూడదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం