తాజా కథలు @ CCK

మంచి మాటలు 391నుండి 400 వరకు

2015-01-16 01:05:02 మంచి మాటలు
*  ముందుకు ఎదగనిది వెనక్కు ఎదిగి కుళ్ళిపోతుంది.
*  చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
*  దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.
*  మనం ప్రేమించలేని వ్యక్తులను ప్రేమించడమే జీవితపు నిజమైన కష్టం అవుతుంది.
*  ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
*  ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు.
*  సహజత, సరళత జీవితాన్ని తియ్యగా చేస్తాయి.
*  విరిగిపోవడం కంటే కూడా వంగడం మెరుగైనది.
*  ఇతరులను జయించాలనుకోకు. నిన్ను నీవు జయించు. అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది.
*  ప్రపంచంలోని అందరు మేథావులకన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం