తాజా కథలు @ CCK

మంచి మాటలు 381నుండి 390 వరకు

2015-05-27 01:05:01 మంచి మాటలు
*  మీరు మనుషులను గురించి ఆలోచిస్తారు. కానీ దేవుడు మిమ్మల్ని గురించి ఆలోచిస్తాడు.
*  మరొక కొవ్వొత్తిని వెలిగిండం వల్ల కొవ్వొత్తి కోల్పోయేది అంటూ ఏమీ ఉండదు.
*  లెక్కించేందుకు ఇంకేమీ లేనప్పుడు, మనిషి తన వ్రేళ్ళను లెక్కిస్తాడు.
*  ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.
*  తనకు అర్ధం కాని వాటిలో మనిషికి మరింత నమ్మకం.
*  సోమరి తనం మూర్ఖుల సెలవు రోజు.
*  మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పేముందే మీరు ఒప్పుకోండి.
*  ఉదయం దినాన్ని సూచించినట్లే బాల్యం మనిషిని సూచిస్తుంది.
*  ప్రేమగుణం కలిగిన వారు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించరు.
*  భగవంతుడు ప్రేమించబడేవాడే కాని భయాన్ని కలిగించేవాడు కాదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం