తాజా కథలు @ CCK

మంచి మాటలు 371నుండి 380 వరకు

2015-06-17 03:05:01 మంచి మాటలు
*  అధైర్యానికి అవకాశమివ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు.
*  ఏ దేశానికైన ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది.
*  బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు.
*  ఆరాధన భావంతో సేవను చేయండి.
*  అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది.
*  వ్యక్తిగతశాంతి విశ్వశాంతికి బాటను వేస్తుంది.
*  వయసులో రోజులు పొట్టి, ఏళ్ళు పొడవు, పెద్దయ్యాక ఏళ్ళు పొట్టి, రోజులు పొడవు.
*  చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?
*  మనోవికారాలకు గురి అయిన జీవితం ఆత్మవినాశనంతో ముగుస్తుంది.
*  మనుషులను విమర్శిస్తూ పోతే వారిని ప్రేమించడానికి మీకు సమయం దొరకదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం