తాజా కథలు @ CCK

మంచి మాటలు 321నుండి 330 వరకు

2015-04-14 15:05:01 మంచి మాటలు
*  విజయం అన్నది ఒక మనోభావన, అది మీ మనోబలంతో ప్రారంభమవుతుంది.
*  భగవంతుడు + కోరిక = మనిషి, మనిషి - కోరిక = భగవంతుడు.
*  నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.
*  మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.
*  మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే, అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది.
*  కలసి ఆటలాడండి.కలసి ప్రార్ధన చేయండి. ఒకతిగా కలసి ఉండండి.
*  మంచివారితో కలిసి ఉండండి. కానీ ఇతరులను ఇష్టపడకున్నా వారిని ద్వేషించడం మాత్రం చేయకండి.
*  సూర్యుడి వైపు ముఖం చేయండి. అప్పుడు చెడు మీకు కనిపించదు.
*  ఇతరులు మీ పట్ల ఎలా వ్యవహిరించాలని మీరు కోరుకుంటారో అదేలా ఇతరుల పట్ల మీరు వ్యవహరించండి.
*  ఆశ్చర్యంలో నుంచే తత్త్వశాస్త్రం పుడుతుంది - సోక్రటీస్.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం