తాజా కథలు @ CCK

మంచి మాటలు 291నుండి 300 వరకు

2015-05-27 11:05:01 మంచి మాటలు
*  ఆజ్ఞాపాలన తెలిసిన వ్యక్తికి ఆజ్ఞను ఇవ్వడం కూడా తెలిసి ఉంటుంది.
*  జీవితంలో అపూర్వ ఆభరణం వినయం.
*  ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
*  మంచి నిర్ణయంను అనుభవం ద్వారా మనం తీసుకుంటాము. చెడు నిర్ణయం ద్వారానే అనుభవం దక్కుతుంది.
*  ఇతరుల అనుభవాల ద్వారా మనలో కొంతమంది మాత్రమే నేర్చుకుంటారు.
*  మౌనం అన్నది వెటకారానికి సంపూర్ణ అభివ్యక్తి.
*  స్నేహితులను ఆకట్టుకోవాలనుకుంటే, ఆసక్తికరమైన వ్యక్తులలో మన చోటును పదిలం చేసుకోవాలంటే ఇతరులు మీ పట్ల ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో అలా మీరు ఇతరులపట్ల వ్యవహరంచండి.
*  లోకమనే ఉద్యానవనంలో పూచిన పువ్వులు పిల్లలు.
*  లక్ష్యం పట్ల ఉన్న స్ధిరత్వం పైనే గెలుపు రసహ్యం దాగుంటుంది.
*  ప్రవాహంలో కొట్టుకుపోతున్న రాయికి పాచి అంటుకోదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం