తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-05-16 03:05:01 మంచి మాటలు
*  చీకటిలో మీరు వ్యవహరించే తీరే మీ గుణం.
*  ప్రతి గొప్పమనిషి వెనుక ఒక గొప్ప మహిళ ఉంటుంది.
*  వంట రుచి తిన్నప్పుడే బుజువు అవుతుంది.
*  చెడ్డను నాటితే దక్కేది దుఃఖమే.
*  తెలుసుకోడం కాదు, ఆచరించడమే కష్టం - షూకింగ్.
*  క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.
*  మీకు నచ్చిన సేవకుడు కావాలంటే మీ సేవలు మీరే చేసుకోండి.
*  మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష.
*  మంచి చెట్టు చెడుఫలాన్ని ఇవ్వనట్లే కుళ్ళిన చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వదు.
*  ప్రేమ సూర్యుడి లేత కిరణాలలాగా రోజంతా వెచ్చదనాన్ని అందజేస్తుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం