తాజా కథలు @ CCK

మంచి మాటలు 221నుండి 230 వరకు

2015-05-10 09:05:01 మంచి మాటలు
*  కుక్కకు ఎముక వేయడం దానం కాదు. కుక్కకున్నంత ఆకలి నీకున్నప్పుడు ఆ కుక్కతో ఎముకను పంచుకోవడం నిజమైన దానం.
*  సంక్షిప్తత హాస్యానికి ఆత్మ అయితే నిర్ధిష్టత ఆ ఆత్మ పనిచేస్తే కొత్త తీరు అవుతుంది.
*  మనసునిండా నిజాయతీ పెల్లుబకాలే కాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు - పండిట్ మోతీలాల్ నెహ్రూ.
*  కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.
*  మనిషి స్వతంత్రంగా పుట్టాడు. కాని అతడు అన్నిచోట్లా బంధాలతో బంధింపబడి ఉన్నాడు.
*  పిర్యాదుల చేసే వారే అతి ఎక్కువగా పిర్యాదులు చేయబడవలసిన వారౌతారు.
*  ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాని కప్పి పుచుతుంది.
*  మందగించక ముందు అడుగెయ్ వెనుకబడితే వెనకేనోయ్ - గురజాడ.
*  మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనిని చిరునవ్వుతో చేయడం అన్నది సహకారం అవుతుంది.
*  ఎదురైన కష్టం ఎంత గొప్పదైతే దాన్ని అధిగమించడం వల్ల వచ్చే ఘనత అంత ఎక్కువ.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం