తాజా కథలు @ CCK

మంచి మాటలు 201నుండి 210 వరకు

2015-04-24 05:05:01 మంచి మాటలు
*  మనకు తక్కువ జ్ఞానం ఉన్నప్పుడే విషయాలు బాగా అర్థం అవుతాయి. అధికజ్ఞానంతో పాటు సందేహం కూడా పెరుగుతుంది.
*  మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్ప వాడవుతాడు.
*  మంచి పనులు ఆలస్యాన్ని సహించవు.
*  అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
*  మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు.
*  విద్యను పొందడం సులభమే కాని వివేకం పొందడం కష్టతరమైన కార్యం.
*  కష్టాలను ఆహ్వానించేవారు అని వచ్చిన తరువాత ఎల్లప్పుడూ పిర్యాదు చేస్తారు.
*  విమర్శకుల విమర్శనను పట్టించుకోకండి. విమర్శకుడి గౌరవార్ధం ఇంతవరుకు ఎక్కడా శిలా విగ్రహం ప్రతిష్ఠాపింపబడలేదు.
*  పిరికితనంలాంటి పాపం వేరొకటి లేదు.
*  మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం