తాజా కథలు @ CCK

మంచి మాటలు 151 నుండి 160 వరకు

2015-06-11 03:05:01 మంచి మాటలు
*  ప్రపంచ శాంతిని, తమ షరతుల ప్రకారం ఆశించే దేశాలే యుద్ధ బీజాలను నాటుతున్నాయి.
*  నీ పట్ల ఇతరులు ఆసక్తి చూపాలనుకోవడం కంటే ఇతరుల పట్ల నీవు ఎక్కువ ఆసక్తి  చూపినప్పుడు ఎక్కువ స్నేహితులను పొందవచ్చు.
*  మూర్ఖుడు చివర చేసేదాన్ని వివేక వంతుడు వెంటనే చేస్తాడు.
*  వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి.
*  మీలోని మంచితనం మరింత మంచితనంగా, మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి.
*  నిజమైన అందం పవిత్రమైన హృదయమై ఉంటుంది.
*  ముళ్ళను నాటి గులాబీల కోసం ఎదురుచూడకూడదు.
*  వాడి అయిన ముళ్ళే తరచుగా నాజూకైన గులాబీని ఇస్తాయి.
*  మనలో ప్రశాంతతను కనుగొనలేని పక్షంలో దానికోసం ఇతర చోట్ల వెతకడం వ్యర్ధం.
*  ఇతరుల తప్పుల వైపు ఎక్కువగా దృష్టిన్ని సారించేవారికి సొంత తప్పులను పరీక్షించేందుకు తీరిక లభించదు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం