తాజా కథలు @ CCK

మంచి మాటలు 141 నుండి 150 వరకు

2015-06-18 11:05:01 మంచి మాటలు
*  రహస్యమనేది మీలో మీరు దాచుకున్నంతసేపూ అది మీకు బానిస; బయటకు వొదిలారా, అది మీకు యజమాని.
*  చిన్న చిన్న గొడ్డలి పెట్లే మహావృక్షాన్ని సహితం పడదోస్తాయి.
*  ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు.
*  ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుంటే భగవంతునికి సన్నిహితముగా ఉంటావు.
*  అరువు తీసుకున్నవాడు తన స్వాతంత్ర్యాన్ని అమ్ముకుంటాడు.
*  ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయం, ఎదుటి మనిషిని అర్ధం చేసుకోవడమే.
*  ఒంటరిగా ఉండగల సామర్ధాన్ని పొందండి. ఏకాంతపు లాభాలను పోగొట్టుకోకండి.
*  చాలా ఎక్కువ పరిశీలించే వ్యక్తి ఏ పని చేయలేడు.
*  శత్రువుల సంఖ్యను పెంచుకోదల్చుకున్నారా? అయితే కోంత మార్పును తీసుకుని వచ్చేందుకు ప్రయత్నించండి.
*  దిగులు, దౌడు తీసే గుర్రంలాంటిది. దౌడు తీస్తూనే ఉంటుందే కాని అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకవెళ్ళదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం