తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-05-05 09:05:01 మంచి మాటలు
*  వయస్సులో నేర్చుకున్నది రాతి మీద చెక్కిన చెక్కడంతో సమానం.
*  ఇతరులను సంతోషపరచడంలోనే నిజమైన సంతోషం దాగుంది.
*  చాలామంది ఇతరులకంటే బాగా చేయగలిగిన పని తమ చేతివ్రాతను తామే చదువుకోగలగడమే.
*  ప్రతి దానిలోనూ కొంత లోటు ఉంటుంది.
*  చిరకాలం నిలిచిపోయే పనులపైన జీవితాన్ని వెచ్చించడమే దాని పరమ ప్రయోజనం అవుతుంది.
*  స్నేహితుడు రెండు శరీరాలలో నివసించే ఒక ఆత్మ.
*  ఒక వ్యక్తి యొక్క విలువ అతని మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది.
*  అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి.
*  విద్యాధికుడై, తన పాండిత్యాన్ని ఉపయోగించుకోని మనిషి - పుస్తకాల బరువు మోసే మృగం.
*  కఠిన పరిశ్రమకు ప్రత్యామ్నాయం అన్నది లేదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం