తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-04 17:05:01 సామెతలు
*  ఏ గాలికి ఆ చాప ఎత్తాలి .

*  వేషాలు కోసం దేశాల పాలయినట్లు.

*  రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు.

*  కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు.

*  కననిది బిడ్డా కాదు. కట్టనిది చీరా కాదు.

*  ఆయుష్షు లేక చస్తారు గానీ, ఔషదం లేక కాదు.

*  వరి పండని ఊరు - దొర వుండని ఊరు ఒకటే.

*  కొన్న దగ్గిర కొసరు గాని కోరిన దగ్గర కొసరా.

*  చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా గాలించినట్లు.

*  చిన్న పిల్లలు లేని ఇల్లు ఇల్లూ కాదు, జీలకర్ర లేని కూర కూరగాదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం