తాజా కథలు @ CCK

తెలుగు పద్యాలు

  • img

    పద్యము తెలుగు కవితా రచనలో ఒక విధానము. పూర్వం తెలుగులో సాహిత్యరచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు. వైజ్ఞానిక రచనలు, గణిత రచనలు, సాహిత్యపరమైన రచనలు మొదలుకొని అనేకానేకమైన విధాలైన రచనలు కూడా పద్యాల్లో ఉండేవి. పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ.

ఖగోళ జ్ఞానం

  • img

    ఖగోళ శాస్త్రము అంటే నభోమండలం గురించిన అధ్యయనం. అంటే అంతరిక్షశాస్త్రం. అకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర గ్రహ, నక్షత్రాదులతోపాటు విశ్వంలో ఉన్న అనేక ఖగోళ వస్తువులు/ పదార్థాల ఉత్పత్తి, ఉనికి, లక్షణాలు మరియు నాశనములను శాస్త్రబద్ధంగా వివరిస్తుంది. ఖగోళశాస్త్ర్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి. భారతీయ జ్యోతిష శాస్త్రములో ఖగోళశాస్త్రానికి విశేష ప్రాముఖ్యత ఉంది. సూర్యసిద్ధాంతము అతి ప్రాచీన ఖగోళశాస్త్ర గ్రంథం. దీని రచయిత ఎవరో తెలియదు. ఆర్యభట్ట, వరాహమిహిరుడు ప్రఖ్యాత భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు.

పండగలు

  • img

    సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే పండుగ. సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మత పరంగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత , విశిష్టత దానికే వుంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు. సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు వున్నాయి.

పొడుపు కథలు

  • img

    తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి సృష్టి కర్తలు పల్లె ప్రజలే. పండితులకు కూడ వీటిపై ఆసక్తి కలగడం వల్ల పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం,వినోదం,ఆశక్తీ కలిగించే పొడుపు కథలంటే యిష్టపడని వారుండరు. ఇది పల్లె ప్రజలకు ఒక వినోదంతో కూడిన ఆట. పొడుపు కథలో చమత్కారం, నిగూఢ భావం యిమిడి ఉండటమే దీనికి కారణం. ఎలాగైనా ఇందులో రహస్యం తెలుసుకోవాలనె కుతూహలం ఒకవైపు, దీని గుట్టు విప్పి తన తెలివితేటలు నిరూపించుకోవాలనె తపన ఒకవైపు పొడుపు కథల వైపు మనిషి ఆకర్షించబడతాడు.